1] మమత పంచు
రవి కాంతిని అందించును
శశి వెన్నెల వెదజల్లును
మబ్బు వాన కురిపించును
నీరు నదిలా ప్రవహించు
నేల చెట్లు నెదిగించును
చెట్లు పండ్లు తినిపించును
గాలి ప్రాణి బతుకులోన
చైతన్యము కలిగించును
మనిషి మంచి, మమత పంచి
మనగలిగిన మనిషి యగును
2] సీతాకోక చిలుక
రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది
చిలుకా చిలుకా సీతాకోక చిలుకా
పలుకూ పలుకూ మాతోనైనా పలుకు
వినవా వినవా పూల మాట వినవా
తినవా తినవా తీయని తేనెను తినవా
సీతాకోక చిలుకా నీకోక ఎవరిదమ్మ
రంగుల రెక్కల రతనాల చిలుకా
పూలే నీ నేస్తాలమ్మా,
మకరందమే నీ ఆహారమమ్మా
నీ రంగుల రూపమే హరివిల్లమ్మా
3] మనోహరం
పిల్లలనవ్వులు, పువ్వుల తోటలు
మనోహరం, మనోహరం
పున్నమి వెన్నెల, పూచిన కలువలు
మనోహరం, మనోహరం
పారేనదిలో సాగే పడవలు
మనోహరం మనోహరం
నీటిపయలో మిలమిల చేపలు
మనోహరం, మనోహరం
మలయ పవనం, మంజుల నాదం
మనోహరం, మనోహరం
మామిడి పూతలు, కోయిల పాటలు
మనోహరం, మనోహరం
రవి కాంతిని అందించును
శశి వెన్నెల వెదజల్లును
మబ్బు వాన కురిపించును
నీరు నదిలా ప్రవహించు
నేల చెట్లు నెదిగించును
చెట్లు పండ్లు తినిపించును
గాలి ప్రాణి బతుకులోన
చైతన్యము కలిగించును
మనిషి మంచి, మమత పంచి
మనగలిగిన మనిషి యగును
2] సీతాకోక చిలుక
రంగుల్లో ఉన్నది రమ్యంగా ఉన్నది
పువ్వులో ఉన్నది పూలతేనె తిన్నది
అన్ని చోట్ల ఉన్నది అందంగా ఉన్నది
చిలకల్లో చిన్నది సీతాకోక చిలుకన్నది
చిలుకా చిలుకా సీతాకోక చిలుకా
పలుకూ పలుకూ మాతోనైనా పలుకు
వినవా వినవా పూల మాట వినవా
తినవా తినవా తీయని తేనెను తినవా
సీతాకోక చిలుకా నీకోక ఎవరిదమ్మ
రంగుల రెక్కల రతనాల చిలుకా
పూలే నీ నేస్తాలమ్మా,
మకరందమే నీ ఆహారమమ్మా
నీ రంగుల రూపమే హరివిల్లమ్మా
3] మనోహరం
పిల్లలనవ్వులు, పువ్వుల తోటలు
మనోహరం, మనోహరం
పున్నమి వెన్నెల, పూచిన కలువలు
మనోహరం, మనోహరం
పారేనదిలో సాగే పడవలు
మనోహరం మనోహరం
నీటిపయలో మిలమిల చేపలు
మనోహరం, మనోహరం
మలయ పవనం, మంజుల నాదం
మనోహరం, మనోహరం
మామిడి పూతలు, కోయిల పాటలు
మనోహరం, మనోహరం