ప్రియమిన పిల్లలకు, ప్రేమతో, ఆమ్మ-నాన్న.....
~తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.
~దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది. ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు. నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
~నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
~చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
~చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
~చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి. చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.
~కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.
~కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
~కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
~గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.
~గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక. గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
~గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
~ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.