Sunday, October 17, 2010

Bathukamma Celebrations in Edmonton, Canada


పల్లె నుండి బయలుదేరిన బతుకమ్మ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు,తెలుగు ప్రజలకు ఒక ప్రముఖమైన సాంస్కృతిక చిహ్నంగా మారిపోయింది. ఖండాంతరాల్లో విస్తరించిన తెలుగు ప్రజలు, బతుకమ్మ పండుగను తమ పల్లెల సంస్కృతిని ప్రతిబింబిస్తూ అపురూపంగా జరుపుకుంటున్నారు. ఆనందించాల్సిన విషయమేమిటంటే – తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు నేల నాలుగు మూలలనుండి వచ్చిన తెలుగు వారంతా బతుకమ్మను తమ పండుగగా, తమ సాంస్కృతిక వారసత్వంగా స్వీకరించి సగర్వంగా జరుపుకుంటున్నారు. ఈ రీతిలో పూలు, పాట, నీటితో ప్రకృతి ఆనందోత్సవాన్ని సంబరంగా జరుపుకునే పండుగ ప్రపంచంలో ఇంకెక్కడా లేకపోవడం తెలుగు వారి ప్రత్యేకతా, విశేషమున్నూ. తెలుగు ప్రజలంతా గర్వించాల్సిన సాంస్కృతిక అపురూప సంపద మన బతుకమ్మ పండుగ.