Tuesday, May 28, 2013

ఎదురవుతుంటారు కొందరు...జీవితాన్ని ఉత్సవం చేసేవాళ్ళు...


"ఎదురవుతుంటారు కొందరు:

చిరునవ్వుల్తో
చీకట్లను తరిమి తరిమి తన్నేవాళ్ళు, 

సమయాలకు 
సౌరభాన్ని అద్దేవాళ్ళు,

సంభాషణను 
సమ్మోహితం చేసేవాళ్ళు, 

పరిచయాన్ని 
ప్రపంచం చేసేవాళ్ళు,

సామీప్యాన్ని 
సందర్భంగా మలిచేవాళ్ళు,

 జీవితాన్ని 
ఉత్సవం చేసేవాళ్ళు."