మాట్లాడుకోవాలి
మెత్తగా బత్తాయి పండు తొనలువిప్పినట్టు
మనసువిప్పి మాట్లాడుకోవాలి
గుండెలోపలికి చేతులుపెట్టి బయటకుతీసిన మాటల్ని
షవర్ బాత్ చేయించి
ప్రెష్గా ఎదుటివాళ్ళముందుంచాలి
మాటలేకదా
అమ్మ నాన్న గురువు సంఘం
వీళ్ళంతా నీళ్ళుపోసి పెంచిన మాటలేకదా
అంతా చేయిపట్టుకునిలబెట్టిన మాటలే కదా
మాట్లాడితే
అందరికీ కృతజ్ఞతతో అభివాదం చేస్తున్నట్టుండాలి
అప్పుడే స్నానమాడిన రెండు తడిదేహాలు
తమకంగా కౌగిలించుకున్నట్టుండాలి
మాట్లాడితే
శుభ్రంగా మంచుకడిగిన నిలువెత్తు అరిటాకు మీద
ఆత్మీయులకోసం నిన్ను నువ్వు వొడ్డించుకున్నట్టుండాలి

మాటకు బొమ్మేకాని బొరుసులేదు
మాటకు వెలుగేకాని చీకటిలేదు
మనుషుల్లా మాట్లాడుకోవాలి
అందరిముందు నిన్ను నువ్వు గుమ్మరించేసుకొని
శున్యంగా చిద్విలాసించాలి
తొదుగుల్లేని మాటల్ని జేబుల్నినింపుకొని
గృహదేహాల నుండి బయటపడాలి
ఇంట్లోనైనా వీధిలోనైనా
ఆఫీసులోనైనా పార్లమెంటులోనైనా
ఫ్రేమకోసం స్నేహంకోసం
శాంతికోసం మాట్ట్లాడుకోవాలి
పంజరంలోనుండి పక్షిని వదిలివేసినట్టుండాలి
కొళాయితిప్పితే
నీ నుండి ఏమీ ఆసించని ఓ చిట్టిపాప
చటుక్కున నీ బుగ్గని ముద్దుపెట్టున్నట్టుండాలి
మాటలే కదా
మాటలంటే మనుషుల మనసులేకదా
దయచేసి
మాటని మర్కెట్ మేయొద్దు.