Thursday, March 01, 2007

తొలగి తోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు - కాళోజి

" మనిషి ఎంత మంచివాడు చనిపొయిన వాని చెడును వెను వెంటనే మరుస్తాడు కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు బ్రతికివున్న మనిషిలోని మంచినెపుడు గుర్తించుడు చెడును వెతికి కెలుకుతాడు"
–కాళోజి

“తొలగి తోవెవడిచ్చుత్రోసుకొని పోవలయు.”

ఈ పదాలని face-value తో అర్థం చేసుకోవడం కన్నా అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది. నాకు కవిత్వం గురించి ఎక్కువ తెలువదు. చదివిన ప్రతి సారీ ఒక కొత్త అర్థం స్ఫురించే కవిత గొప్పదని ఒక కవిమితృడు చెప్పిండు. నాకైతే ఈ రెండు లైన్లు ఇట్లా అర్థం అయినయి. కవి ఈ కవితలో బ్రతుకు గురించి మట్లాడుతున్నడు కాబట్టి ఈ రెండు లైన్లు కూడా బ్రతుకు గురించే అన్నడనిపించింది. తొలగి తోవెవడిచ్చు - బ్రతుకు పరిచిన విస్తరి కాదు, బ్రతుకు పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. త్రోసుకొని పోవలయు - ఆ అడ్డంకుల్ని అధిగమిస్తూ బ్రతుకుని సాగించాలి. బ్రతుకు పూల బాట కాదని, అయినా బ్రతుకుని గౌరవిస్తూ ముందుకు వెళ్ళలని చెప్పిన కాళోజీ కవితలో గొప్ప మానవీయ కోణం ఉందని అనుకుంటున్నా."