Wednesday, September 26, 2007

మీ నవ్వు మీ సహృదయతకి సంకేతం

ప్రియమైన పిల్లలకు,


~స్నేహాన్ని మన వ్యక్తిత్వం తొ అకర్షించుకుని పొందగలగాలి. ధనం లేక మరే ఎతర కారణాల వల్ల కాదు.

~మంచి పుస్తకం కూడ నీకు మంచి స్నేహితుడి వంటిది. ప్రతే విషయాన్ని విశ్లేషించే అలవాటు దాని ద్వారా కలుగుతుంది.


~పదిమందితో వ్యవహరించేటప్పుడు, వాళ్ళూ వివేకంతో సహేతుకంగా ఆలోచించలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. భావోధ్రేకాలు, రాగద్వేషాలు నిండిన వారితోనూ, గర్వంతోనూ, అతిశయంతోనూ విర్రవీగే వ్యక్తులతో వ్యవహరిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి

~మీ నవ్వు మీ సహృదయతకి సంకేతం. మీ చిరునవ్వుని చూసేవారందరి జీవితాలు వెలుగుతో నిండుతాయి.



ఫ్రేమతో,
అమ్మ-నాన్న