నీళ్ళపై నడిచేవాణ్ణి చూసి, అడిగినాను
“అలా ఎలా చెయ్యగలిగావు?” అని
ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు.
నిప్పు ముద్దలు తింటున్న వాణ్ణి చూసి, అడిగినాను
“అలా ఎలా చెయ్యగలిగావు?” అని
ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు.
గాలిలో మేఘాలతో మాట్లాడుతున్నవాణ్ణి చూసి, అడిగినాను
“అలా ఎలా చెయ్యగలిగావు?” అని
ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు.
నేడెవరో నన్ను పట్టుకొని అడుగుతున్నారు,
“అలా ఎలా చెయ్యగలిగావు?” అని!
ఓ చిరునవ్వు అప్రయత్నంగానే వెలుగు చూసింది