”అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయ మోసముజూసి మండిపోవును ఒళ్లు, పతిత మానవుజూచి చితికి పోవును మనసు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడు అన్యులను గని యైన హాయిగా మనలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు” అని అన్నడు ‘నా గొడవ’ల కాళోజీ.
ఓ తీరుగ జూస్తే ఇది ఆయన బతుకు ఫిలాసఫీ.
ఇట్ల అవకతవకల జూసి ఊర్కునుడు గాదు, ఆ అవకతవకలకు కారణమైన వాండ్లను ప్రశ్నించడం, వాండ్ల భావాల తోటి ఏకీభవించకపోతే, అవి అన్యాయమైనవైతే అసమ్మతి తెలుపటం, వాండ్ల పద్ధతుల పట్ల నిరసన ప్రకటించటం ఇంకా, తర్వాత వాటిని ధిక్కరించటం కాళోజీ కవిత్వం లక్షణాలు. కవిత్వమే కాదు అవి ఆయన బతుకు లక్షణాలు. ఎందుకంటే కవిత్వమూ బతుకూ రెండు వేరే వేరే లెవ్వు కాళోజీకి. చెప్పుడోటి చేసుడోటి కాళోజీకి తెలువదు.