ధగధగ మెరిసే భానుడు
అదిగో అదిగో తూరుపున
ఉదయరేఖలను ప్రసరించి
ఉత్సాహమునే మనకిచ్చు
కొండలపైన అరుణకాంతితో
కొలను నీటిలో తళతళ మెరుపుతో
కాంతి రేఖలను ప్రసరించి
కారు చీకట్లు తొలగించు
ఆకులపైన చురుక్కుమనుచు
పూవులపైన తళుక్కుమనుచు
వెలుగురేఖలను ప్రసరించి
జగతికి జాగృతి కలిగించు
అదిగో అదిగో తూరుపున
ఉదయరేఖలను ప్రసరించి
ఉత్సాహమునే మనకిచ్చు
కొండలపైన అరుణకాంతితో
కొలను నీటిలో తళతళ మెరుపుతో
కాంతి రేఖలను ప్రసరించి
కారు చీకట్లు తొలగించు
ఆకులపైన చురుక్కుమనుచు
పూవులపైన తళుక్కుమనుచు
వెలుగురేఖలను ప్రసరించి
జగతికి జాగృతి కలిగించు