Friday, June 22, 2007

Lincoln's letter to his son's teacher...


He will have to learn,
I know, that all men are not just,
all men are not true.
But teach him also that for every scoundrel there is a hero;
that for every selfish politician, there is a dedicated leader...
Teach him for every enemy there is a friend,

Steer him away from envy,
if you can, teach him the secret of quiet laughter.

Let him learn early that the bullies are the easiest to lick...
Teach him, if you can, the wonder of books...
But also give him quiet time to ponder
the eternal mystery of birds in the sky, bees in the sun,
and the flowers on a green hillside.

In the school teach him it is far honourable to fail than to cheat...
Teach him to have faith in his own ideas, even if everyone tells him they are wrong... Teach him to be gentle with gentle people, and tough with the tough.

Try to give my son the strength not to follow the crowd
when everyone is getting on the band wagon...

Teach him to listen to all men...
but teach him also to filter all he hears on a screen of truth,
and take only the good that comes through.

Teach him if you can, how to laugh when he is sad...
Teach him there is no shame in tears,
Teach him to scoff at cynics and to beware of too much sweetness...
Teach him to sell his brawn and brain to the highest bidders
but never to put a price-tag on his heart and soul.

Teach him to close his ears to a howling mob
and to stand and fight if he thinks he's right.
Treat him gently, but do not cuddle him,
because only the test of fire makes fine steel.
Let him have the courage to be impatient...
let him have the patience to be brave.
Teach him always to have sublime faith in himself,
because then he will have sublime faith in mankind.

This is a big order, but see what you can do... He is such a fine fellow, my son!



అబ్రహం లింకన్ ఉత్తరం...

నాకు తెలుసు - అతను చాలా నేర్చుకోవాలి. మనుషులంతా దయామయులు, నిజాయితీపరులు కారని అతను గ్రహించాలి. అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారనీ, స్వార్ధ రాజకీయవాదులతో పాటు, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నేతలూ ఉంటారని అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి.


నాకు తెలుసు - అతను నేర్చుకోడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఇతరత్రా లభించిన ఐదు డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనదని అతడు గ్రహించేలా చూడండి. అతనిని ఓటమిని తెలుసుకోనివ్వండి. గెలుపుని ఆనందించడం నేర్పండి. అసూయకు అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే, స్వచ్చమైన నవ్వులోని రహస్యాన్ని అతడికి నేర్పండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి. ప్రకృతిని - ముఖ్యంగా నీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను,పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని - ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయమివ్వండి. మోసం చేయడం కన్నా, విఫలమవడంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి. ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ, తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి. అతను సౌమ్యులతో సౌమ్యంగానూ, కఠినాత్ములతో ధృడంగాను వ్యవహరించేడట్లు చూడండి.
కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా, వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి. ఇతరులు చెప్పేవాన్నీ విని, వాస్తవం అనే చిక్కంలో వడపోసి, వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి. మీకు వీలైతే బాధలలోను అతడు నవ్వగలిగేలా చూడండి. అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి.


నిత్యశంకితులను తిరస్కరించడం అతనికి నేర్పండి. అలాగే అతి మంచితనం పత్ల అతడిని అప్రమత్తం చేయండి. తన కష్టానికి, తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయడం అతడికి నేర్పండి. కాని అతను తన హృదయానికి, ఆత్మకి వెలకట్టకుండా చూడండి. అల్లరి మూకల ప్రేలాపనలని పట్టించుకోకుండా, ఎదురొడ్డి పోరడడం అతనికి నేర్పండి.

అతనితో మృదువుగా వ్యవహరించండి. కాని గారాబం చేయవద్దు. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది. అతడిని ధైర్యంతోను, సహనంతోను మెలగనివ్వండి. నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోడం అతనికి నేర్పండి. అప్పుదే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది. వీటన్నింటిలోను మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి”.లింకన్ పై ఉత్తరాన్ని తన కొడుకు కోసం రాసినప్పటికీ, అందులోని అంశాలు ప్రపంచం లోని మొత్తం పిల్లలందరికి వర్తిస్తాయి. వాటిని నేర్చుకోగలితే పిల్లలు పరిపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకుంటరనడంలో ఎటువంటి సందేహం లేదు.(స్వేచ్చానువాదం! 15 ఏప్రిల్ 2000 నాటి వార్త దినపత్రిక యొక్క ‘మొగ్గ ‘ అనే పేజీలో ప్రచురితం)