Saturday, June 23, 2007

అధ్యాపక వృత్తిని చేపడతా: అబ్దుల్ కలాం


23 జూన్ 2007

రాష్ట్రపతి పదవి నుండి దిగిపోగానే తిరిగి అధ్యాపక పదవిని చేపట్టనున్నట్లు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తెలిపారు. ఈ విషయమై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రపతి పదవిని చేపట్టక ముందు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు పాఠాలను బోధించాలని అనుకున్నానని తెలిపారు.

రాష్ట్రపతి పదవిని చేపట్టడం ద్వారా ఇది సాధ్యం కాలేదని తెలిపిన కలాం, వచ్చేనెల పదవీ నుంచి దిగిపోగానే దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాలు, గ్రామీణ విశ్వవిద్యాలయాలు, నలంద యూనివర్శిటీ అంతరిక్ష పరిశోధన వర్శీటీలకు చెందిన విద్యార్థులకు బోధించనున్నారని తెలిపారు. కలాం పదవీ కాలం జూలై 24వ తేదీతో పూర్తికానున్న తరుణంలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అబ్దుల్ కలాం నిరాకరించిన విషయం తెలిసిందే.