Sunday, June 24, 2007

సాహిత్యం : సామెతలు!


~ రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.
~ రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
~ లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.
~ వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
~ విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
~ విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.
~ విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.
~ వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.
~ సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది.
~ సాహసించని వాడు గెలుపును సాధించలేడు.
~ పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
~ మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.
~ మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
~ మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
~ మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
~ మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
~ మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
~ మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
~ మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
~ మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
~ మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.
~ మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
~ నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
~ కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
~ అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
~ అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
~ ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.