"How to win friends and influence people" పుస్తకాన్ని 1937లో మొదటిసారిగా ప్రచురించారు. ఇప్పటికి 70 ఏళ్ళు దాటింది. ఈ రోజుకి కూడా ఇది బెస్ట్ సెల్లర్. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చినా, ప్రముఖ రచయిత్రి ఆర్. శాంతసుందరి అనువాదం చేశారు. ఏమిటీ పుస్తకం గొప్పతనం?
మనకిష్టమున్నా లేకపోయినా మనం పదిమందితో కలిసి జీవించాలి. ఎదుటివారితో ఎలా వ్యవహరించాలన్నది ప్రతిమనిషి ఎదుర్కొనే అతి పెద్ద సమస్య. దీనికి పరిష్కారాన్ని ఈ పుస్తకం చూపుతుంది.
డేల్‌కార్నెగి ఏమంటారంటే”-
1. విమర్శవల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. విమర్శని ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడూ ఎదురు తిరుగుతాడు. తనని తాను సమర్ధించుకుంటాడు. విమర్శ ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తి తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది.
2. పదిమందితో వ్యవహరించేటప్పుడు, వాళ్ళూ వివేకంతో సహేతుకంగా ఆలోచించలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. భావోధ్రేకాలు, రాగద్వేషాలు నిండిన వారితోనూ, గర్వంతోనూ, అతిశయంతోనూ విర్రవీగే వ్యక్తులతో వ్యవహరిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి.
3. మనకి స్నేహితులు కావాలనుకుంటే ఎంతో ఉత్సాహంగానూ, సంతోషంగానూ ఇతరుల్ని పలకరించాలి.
4. మాటలకన్న చేతల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఒక్క చిరునవ్వు ఎదుటివారితో నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు ఆనందం కలుగజేస్తావు.నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది అనగలదు.
5. మీ నవ్వు మీ సహృదయతకి సంకేతం. మీ చిరునవ్వుని చూసేవారందరి జీవితాలు వెలుగుతో నిండుతాయి.
6. ఏ బాషలోనైనా సరే, ఒక్ అవ్యక్తికి అతని పేరులోని ఉచ్చారణే అతి మధురమైన అతి ముఖ్యమైన శబ్దమనే విషయం గుర్తుంచుకోండి.
7. ఇంకొకరి మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పే అలవాటున్నవాళ్ళూ, అందర్నీ విపరీతంగా విమర్శించేవాళ్ళు కూడా, ఎంతో ఓర్పుతో, సానుభూతితో వారి మాటలు వినేవాళ్ళ ముందు మెత్తబడిపోతారు.
8. గొప్ప వ్యక్తులే కదు. మామూలు జనం కూడా శ్రద్ధగా వినేవాళ్ళనే ఇష్టపడతారు.
9. చక్కగా వినండి. ఎదుటివారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి.
10. ఇతరుల అభిరుచుల్ని గమనించి, వాటి గురించే మాట్లాడండి.
11. ఇతరులు మనకి ఏమివ్వాలని కోరుకుంటున్నామో అదే ఇతరులకి ఇద్దాం.
12. మనస్ఫూర్తిగా మనసు లోతులనుంచి వచ్చే పొగడ్తకి అధ్బుతమైన శక్తి వుంటుంది.
13. అవతలి వ్యక్తి తాను ముఖ్యమైనవాడినని అనుకునేవిధంగా ప్రవర్తించండి. కానీ చేసేది మనస్పూర్థిగా చేయండి.
14. ఒక వాదన నుంచి లాభం పొందలంటే దాన్నించి తప్పించుకోవటం ఒకటే మార్గం.
పదిమందిని ఆకట్టుకునే కళ గురించి కార్నెగి అధ్బుతమైన ఉదాహరణలు, పిట్టకథలతో వివరిస్తాడు. నిజానికి ఈ 70 ఏళ్ళలో ప్రపంచం ఎంతో మారింది. ఈ పుస్తకం రాసేనాటికి ప్రపంచీకరణ లేదు. కంప్యూటర్లు లేవు. శక్తివంతమైన మీడియా లేదు. ప్రచార రంగం, మార్కెట్ నైపుణ్యం మనుషుల్ని శాసించే స్థితిలో లేవు. అయినా ఇన్నేళ్ళుగా ఇది అగ్రస్థానంలో నిలబడి వుందంటే కారణం ఈ పుస్తకానికి జీవితమే పునాది. ఇంగ్లీషులో చదవని వాళ్ళంతా ఇప్పుడు తెలుగులో చదువుకోవచ్చు. వెల 15 రూపాయలు..