బ్లాగు పేరు ఎన్నుకోవడం నుండి రూపురేకలను ఎన్నుకోవడం వరకు, బ్లాగులో వ్రాసే విషయాల నుండి వ్యాఖ్యలకు ఇచ్చే సమాధానాల వరకూ: బ్లాగ్రాయడం ఓ కళ.
ఆలోచనలను సృజనాత్మకతతో నిజాయితీగా అందంగా ప్రదర్శించే అధ్బుతమైన కళ - బ్లాగ్రాయుట.
చదువరుల ఇంద్రియాలకు అందాన్ని, ఆనందాన్నీ ఆలోచనను ఓ మెట్టు పైన కలిగించే అధ్బుతమైన కళ - బ్లాగ్రాయుట.
నైపుణ్యాన్ని దినదిన ప్రవృద్ధిమానం చేసుకుంటూ రంగంపైన ఆవిష్కరించే అధ్బుతమైన కళ - బ్లాగ్రాయుట.
విలువలతో కూడిన మరోజీవితంవైపు చదువరులను నడిపించే అధ్బుతమైన కళ - బ్లాగ్రాయుట.