తప్పా! రైటా!
టీచర్ : రవి "రేపు నీవు స్కూల్కు వచ్చితివి"ఈ వాక్యం తప్పా! రైటా!"
రవి : తప్పండి
టీచర్ : గుడ్ ఎందుకు?
రవి : రేపు ఆదివారం కదా! స్కూల్ ఉండదు కాబట్టి.
దండించడం
విద్యార్థి : "నేను చేయని పనికి నన్ను దండించడం న్యాయమా?"
పంతులు : "కాదు! విషయమేమిటో చెప్పు?"
విద్యార్థి : "నేను హొం వర్క్" చేయలేదండి! "
ఎందుకు?
టీచర్ : "గోపీ! భారతం ముందా? రామాయణం ముందా?"
గోపీ : "భారతమే సార్!"
టీచర్ : ఎందుకు?
గోపి : "ఏది ముందు రాస్తే అదే!"
నిద్ర
భగవాన్ : ఒరేయ్ భజ గోవిందం! నీ ఆఫీస్‌లో పని చేసే వారంతా ఎంచక్కా నిద్రపోతున్నారు.
భజ గోవిందం : ఆరేళ్ళుగా ఈ ఆఫీస్ మేనేజర్‌గా అఘోరిస్తున్నాను నాకు తెలియదట్రా? నన్ను నిద్ర లేపి మరీ చేప్పాలంట్రా!
విమానం
టీచర్ : ఒరే రవీ విమాననాన్ని ఎవరు కనుగొన్నారురా?
రవి : "రైట్ సోదరులండీ"
టీచర్ : "ఒరే నానీ! రైలునెవరు కనుగొన్నారురా?"
నాని : "లెఫ్ట్ సోదరులు సార్"
చెప్పింది చేసావా...
తండ్రి : ఒరే వెధవ అమ్మనీకేదో చెప్పింది చేసావా?
కొడుకు : ఓ చేసా... పిల్లి పాలుత్రాగిపోతుంది చూస్తుండమని చెప్పింది. అది ఎంచక్కా ఇప్పుడే పాలు త్రాగి మూతి కూడా తుడుచుకుంది.
మాష్టారు:
వెయ్యిలోనుండి ఒకటి తీస్తే ఎంత సుశీలా ?
'మూడు సున్నాలు సార్'.
ఉత్తరం
టీచర్ : ఒరేయ్ నవీన్! దక్షిణాన్ని 'సౌత్' అంటారు కదా. మరి ఉత్తరాన్ని ఏమంటారు?
నావీన్ : 'పోస్ట్‌కార్డ్' అంటారు టీచర్.
పెద్దయ్యాక...
టీచర్ : ఒరేయ్ రామూ... నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా?
రాము : ముసలివాణ్ణవుతాను టీచర్.
ప్రాముఖ్యత
"దసరా" పండుగ ప్రాముఖ్యత ఏమిట్రా రవీ? అడిగారు ప్రయివేటు మాస్టారు.
"బడికి సెలవు" సార్.
క్రమశిక్షణ
ఏరా రవీంద్రా క్రమశిక్షణ అంటే ఏమిట్రా?
ఒక్కొక్కరిని శిక్షించడం సార్.