ఎక్కడ జ్ఞానం నిర్భయంగా, తల ఎత్తులు తిరగగలదో,
ఎక్కడ విజ్ఞానం స్వేఛ్చావాయువులు పీల్చగలదో,
ఎక్కడ విశ్వం కుటిల యుద్ధరాజనీతికి ముక్కలవదో,
ఎక్కడ మాటలు సత్యాంతరాలంలోంచి ఉబికివస్తాయో,
ఎక్కడ అలుపులేని పోరాటపటిమే ప్రావీణ్యానికి చేతులు చాస్తుందో,
ఎక్కడ ప్రశ్నల ఝరి నిర్జీవపు అలవాట్ల ఇసుకతిన్నెల, నిస్సత్తువ ఎడారిలోకి దారి తప్పదో,
ఎక్కడ జ్ఞానం అనంతమైన ఆలోచనలలోకి నీవల్ల దారి చూపబడుతుందో,
ఆ స్వేచ్చా స్వర్గంలోకి, ఓ తండ్రీ, నా ఈ దేశాన్ని మేల్కొలుపు…